ఈఫిల్‌ టవర్‌కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌

3 May, 2017 17:34 IST|Sakshi
ఈఫిల్‌ టవర్‌కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌

న్యూఢిల్లీ: భారత రైల్వే ‍వ్యవస్థ మరో సంచనానికి సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఓభారీ వంతెన నిర్మాణానికి ప్రణాలికలు వేస్తోంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇది. సుమారు 1.3కిలోమీటర్ల పొడవుతో జమ్మూలోని కాట్ర, శ్రీనగర్‌లోని కౌరీ ప్రాంతాలను కలుపుతూ భారత రైల్వే ఈ వంతెన నిర్మించనుంది. భారీ వంపు తిరిగిన ఆకారంలో సుమారు రూ.1110 కోట్లతో నిర్మించనున్నారు.

ఉదంపూర్‌, శ్రీనగర్‌, బారాముల్ల ప్రాంతాలను కలపడంలో ఈబ్రిడ్జ్‌ కీలకపాత్ర పోషించనుంది. తద్వారా ఆయాప్రాంతాల్లో రవాణా వ్యవస్థ వృద్ధి చెందనుందని రైల్వే అధికారులు తెలిపుతున్నారు. ఈ వంతెన పూర్తి అయితే చైనాలోని సుభై(275 మీటర్లు) వంతెన రికార్డును అధికమిస్తుంది. దీనిని పూర్తి చేయడం ఇండియన్‌ రైల్వేకు ఓ సవాలు లాంటిదని, పూర్తి చేస్తే ఇంజనీరింగ్‌ అద్భుతం అవుతుందని రైల్వేశాఖా అధికారి తెలిపారు.

ఈభారీ నిర్మాణంలో సుమారు 24వేల టన్నుల ఇనుమును ఉపయోగించనున్నారు. ఇది చీనాబ్‌నది ఉపరితలానికి సుమారు 359మీటర్లు ఎత్తులో నర్మించనున్నారు. ఉగ్రదాడులు, తక్కువ ఎక్కువ ఉష్ణోగ్రతలను  తట్టుకోనే విధంగా ప్రత్యేక ఇనుమును ఇందులో వాడనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ఆన్‌లైన్‌లో నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు