రాష్ట్రపతి పాలన కొనసాగింపు

28 Apr, 2016 02:52 IST|Sakshi
రాష్ట్రపతి పాలన కొనసాగింపు

ఉత్తరాఖండ్‌లో రేపు బలపరీక్ష ఉండదన్న సుప్రీంకోర్టు
♦ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టే
♦ కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం
 
 న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈనెల 29న అసెంబ్లీలో బలపరీక్ష లేదని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వుల వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా న్యాయయూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఏడు క్లిష్టమైన ప్రశ్నలు సంధించింది.

వీటితోపాటు అవసరమనుకుంటే మరికొన్ని ప్రశ్నలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని అటార్నీ జనరల్ (ఏజీ)కు సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదావేసింది. వచ్చే నెల మధ్య నుంచి కోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున ఆలోపే తీర్పు రావచ్చు. విచారణలో తనను అనుమతించాలన్న రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి  వినతిపై  బెంచ్ మండిపడింది. ఆయన చేసేదేం లేదంది.  కేసు పరిష్కారానికి బలపరీక్ష నిర్వహించడమొక్కటే మార్గంగా కనిపిస్తోందని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందని రాష్ట్రపతి పాలన నిర్ణయంలో సహేతుకత లేకపోతే బలపరీక్ష జరపాల్సి వుంటుందని పేర్కొంది. దీనిపై సూచనలు ఇవ్వాలని అటార్నీ జనరల్ రోహత్గీని కోరింది. రాష్ట్రపతి పాలనను కోర్టు ఎత్తివేయకపోతే మే 27 వరకు అది అమల్లో ఉంటుందని, తర్వాత బలపరీక్ష నిర్వహణ ప్రభుత్వ విచక్షణపైన ఆధారపడి ఉంటుందని రోహత్గీ చెప్పారు.
 
 కేంద్రానికి ఏడు ప్రశ్నాస్త్రాలు
 సబలపరీక్ష ఆలస్యమైతే రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందా? సఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటుకు ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతిపాలనకూ సంబంధముందా? సకేంద్ర పాలననిర్ణయం కోసం అసెంబ్లీ  వ్యవహారాలను రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారా?సఆర్టికల్ 175(2) ప్రకారం బలపరీక్ష నిర్వహిస్తున్నట్లు గవర్నర్ చెప్పారా?సగవర్నర్, స్పీకర్ ఇద్దరూ రాజ్యాంగ అధికారాలున్న వారైనందున డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ సూచించవచ్చా?సనిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందనప్పుడు ఆ విషయాన్ని స్పీకర్ చెప్పకపోతే ఎవరు చెప్తారు?రాష్ట్రపతి పాలన విధిస్తే ద్రవ్యవినిమయ బిల్లు పరిస్థితి ఏంటి?

>
మరిన్ని వార్తలు