వచ్చే నెల్లో పీఎఫ్‌ వడ్డీ రేట్లపై నిర్ణయం

7 Jul, 2017 01:16 IST|Sakshi

న్యూఢిల్లీ:  2017–18 సంవత్సరానికి పీఎఫ్‌ వడ్డీరేట్లను వచ్చే నెల్లో జరిగే సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో నిర్ణయించనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం మాట్లాడుతూ.. ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీల(సీబీటీ) సమావేశం అనంతరం.. వడ్డీరేట్లపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని, వచ్చే నెల్లో సమావేశం ఉండవచ్చని చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై రాబడి అంచనాల మేరకు వడ్డీ రేట్లను సీబీటీ ప్రతిపాదిస్తుందని, అనంతరం చైర్మన్‌ హోదాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ ఏడాది పీఎఫ్‌ వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు(0.25 శాతం) తగ్గించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీలు, బాండ్ల రూపంలో ఈపీఎఫ్‌వో పెట్టిన పెట్టుబడులపై రాబడి తగ్గవచ్చనే అంచనా మేరకు ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు