అత్యధిక జనాభా నగరాల్లో ఢిల్లీకి 2వ స్థానం

12 Jul, 2014 03:15 IST|Sakshi
అత్యధిక జనాభా నగరాల్లో ఢిల్లీకి 2వ స్థానం

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ రెండవ స్థానం చేరింది. ఈ విషయంలో జపాన్ రాజధాని టోక్యో నగరం మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ జనాభా 1990నుంచి ఇప్పటివరకూ రెండింతలకు మించి పెరిగి ఈ ఏడాదికల్లా రెండున్నర కోట్లకు చేరింది. తొలి స్థానంలోని టోక్యో జనాభా తాజాగా 3.8 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. ప్రపంచ పట్టణీకరణ అవకాశాలు అన్న పేరుతో గురువారం ఈ నివేదిక విడుదలైంది. 2050వ సంవత్సరంనాటికి భారతదేశంలోని పట్టణాల్లో జనాభా అత్యధికంగా పెరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో భారత్ చైనాను మించిపోతుందని కూడా నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ జనాభా క్రమంగా తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది.
 

>
మరిన్ని వార్తలు