'పూడికతీత పనులపై వివరణ ఇవ్వండి'

24 Feb, 2017 02:54 IST|Sakshi
'పూడికతీత పనులపై వివరణ ఇవ్వండి'

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలోని బ్యారేజీల్లో పూడికతీత పేరుతో జరుపుతున్న ఇసుక తవ్వకాలపై వివరణ ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది.

ప్రకాశం బ్యారేజీలో, తెలంగాణలోని మేడిగడ్డ–అన్నారంలో, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూడికతీత పనుల పేరుతో బ్యారేజీల్లో పెద్ద ఎత్తున యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయండని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు