పొగపెట్టినా..పోవడం లేదు..!

22 Jun, 2017 01:26 IST|Sakshi
పొగపెట్టినా..పోవడం లేదు..!

ఒక శుభవార్త..
గతంతో పోలిస్తే.. మన దేశంలో పొగాకు వినియోగిస్తున్న వారి సంఖ్య తగ్గిందట..
ఒక దుర్వార్త..
కొంతవరకూ తగ్గించినా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పొగాకు వినియోగిస్తున్న వారి సంఖ్యలో మన దేశం రెండోస్థానంలో ఉందట. మొదటి స్థానం చైనాది.

అంతకుముందు రెండు దశాబ్దాలతో పోలిస్తే.. ప్రజల్లో పొగాకు దుష్పరిణామాలపై అవగాహన పెరిగిందని.. దీని వల్ల 2015–16లో పొగాకు వినియోగిస్తున్న భారతీయుల సంఖ్య తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాదిలో పొగాకు వినియోగాన్ని మానేయడానికి ప్రయత్నించిన వారిలో పురుషుల విషయానికొస్తే.. తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 42.3 శాతం మంది పొగాకు మానేయడానికి ప్రయత్నించారట. ఏపీలో ఈ శాతం 33.1గా ఉంది. అదే మహిళల విషయానికొస్తే.. మానేయడానికి యత్నిం చిన వారి శాతం ఏపీలో ఎక్కువగా ఉంది. ఇక్కడ 37.8 శాతం మంది యత్నిస్తే.. తెలంగాణలో అది 35 శాతంగా ఉంది. 
– సాక్షి, తెలంగాణ డెస్క్‌

దేశంలో పొగాకు వినియోగం
మగవారు: 44%
మహిళలు: 30.5%

ఈశాన్య భారత్‌లో అధికం... (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2015–16) మేరకు..)
ముఖ్యంగా ఈశాన్య భారత్‌లో పొగాకు వినియోగదారులు ఎక్కువ.


మిజోరాం, నాగాలాండ్, మేఘాలయా, మణిపూర్, త్రిపుర, అస్సాంలో మగవారి సగటు 70.7%
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి 1000 మరణాల్లో కేన్సర్‌తో చనిపోతున్నవారు. 172
దేశంలో కేన్సర్‌తో చనిపోతున్నవారి సగటు 91
పొగాకు వాడకంలో అత్యల్పం (శాతాల్లో) 19.2% పంజాబ్‌ ,14.4% పుదుచ్చేరి

మరిన్ని వార్తలు