మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

19 Nov, 2016 02:53 IST|Sakshi
మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

రెండో రోజూ అదే తీరు
- నోట్ల రద్దుపై స్తంభించిన ఉభయ సభలు
- ఆగని విపక్షాల ఆందోళన..అధికార పక్షం ఎదురుదాడి
 
 న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై వరుసగా రెండోరోజు పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. విపక్షాల వారుుదా తీర్మానంపై చర్చ, ఓటింగ్‌కోసం లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో నోట్ల రద్దు చర్చలో ప్రధాని పాల్గొనాలని కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆందోళన చేయటంతో.. ఉభయ సభలు శుక్రవారం ఎలాంటి చర్చ జరగకుండానే వారుుదా పడ్డాయి.

 లోక్‌సభలో వారుుదాకు పట్టు
 శుక్రవారం సభ ప్రారంభమైనప్పటినుంచీ విపక్ష సభ్యులు పోడియం చుట్టూ మూగారు. వివిధ పక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అన్ని సభాకార్యక్రమాలను రద్దుచేసి చర్చ, ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే నోట్లరద్దుపై రూల్ 56 కింద చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. ప్రభుత్వం సూచించిన రూల్ 193 కింద చర్చ (స్వల్పకాలిక) వద్దని స్పీకర్‌ను కోరారు. విపక్షాల వారుుదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. చర్చకు సిద్ధమేనని తెలిపారు. అరుునా విపక్షాల ఆందోళన తగ్గలేదు. ఈ అంశంపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వారుుదా తీర్మానాల అవసరం లేదని పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత కుమార్ స్పష్టం చేశారు. అరుునా విపక్షాలు శాంతించకపోవటంతో సభను స్పీకర్ వారుుదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే విపక్షాలు పోడియంను చుట్టుముట్టారుు. దీనిపై అనంత్ కుమార్ స్పందిస్తూ.. ‘చర్చకు సహకరించండి. నోట్ల రద్దుపై చర్చ నుంచి విపక్షం తప్పించుకోవాలని చూస్తోంద’న్నారు.

 రాజ్యసభకు ప్రధాని రావాలి: విపక్షాలు
 ఎగువ సభ ప్రారంభం నుంచే.. అధికార విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు వెల్‌లోకి చొచ్చుకుపోరుు.. ‘ఉడీ’ వ్యాఖ్యలపై ఆజాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు కూడా సభకు ప్రధాని హాజరుకావాలంటూ నినాదాలు చేశారుు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారుు. కావేరీ జలాల విడుదలపై అన్నాడీఎంకే సభ్యులు కూడా వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో సభను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వారుుదా వేశారు. మళ్లీ సమావేశం కాగానే.. ‘ఆజాద్ ప్రకటనతో ఉగ్రవాదులపై కాంగ్రె స్ సానుభూతితో ఉందనే విషయం దేశానికి అర్థమైంది. అందుకే నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న నోట్ల రద్దుపై ఆందోళన చేస్తోంది’ అని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి  నఖ్వీ అన్నారు.
 
 మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
 ‘ఉడీ’ఘటన అమరులను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలంటున్న బీజేపీ తీరుపై కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత గులాంనబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు పెట్టే నిర్ణయం తీసుకున్నందుకు, దేశాన్ని వెనక్కు నెట్టినందుకు 125కోట్ల మందికి బీజేపీయే క్షమాపణ చెప్పాలన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీలో మూడు ప్రాంతాల్లో (మీరట్, లక్నో, వారణాసి), పంజాబ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించాలని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ నిర్ణరుుంచారు.

మరిన్ని వార్తలు