హిమాచల్‌ రెండో రాజధానిగా ధర్మశాల

20 Jan, 2017 03:20 IST|Sakshi

షిమ్లా: ధర్మశాలను హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రెండో రాజధానిగా ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ గురువారం ప్రకటించారు. కాంగ్రా జిల్లాలో ఉండే ధర్మశాలకు ఇప్పటికే ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, రెండో రాజధానిగా ఈ నగరం సముచితంగా ఉంటుందన్నారు. శీతాకాల విడిదికి విచ్చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ధర్మశాలలోనే ఉంటున్నారు.

2005లో తొలిసారి ఇక్కడ పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఇప్పటికే 12 సార్లు ఇక్కడ శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది.

>
మరిన్ని వార్తలు