జమ్మూకశ్మీర్‌లో మంత్రి కాన్వాయ్‌పై ఉగ్రదాడి

22 Sep, 2017 01:43 IST|Sakshi

ఇద్దరు పౌరుల దుర్మరణం, 34 మందికి గాయాలు
శ్రీనగర్‌/జమ్మూ:
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని త్రాల్‌ పట్టణంలో గురువారం పర్యటనకు వచ్చిన రాష్ట్ర ప్రజాపనుల మంత్రి నయీమ్‌ అఖ్తర్‌ లక్ష్యంగా ఆయన కాన్వాయ్‌పై గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి అఖ్తర్‌ సురక్షితంగా తప్పించుకోగా ఇద్దరు పౌరులు గులామ్‌ నబీ త్రాగ్‌(56), పింకీ కౌర్‌(17)లు దుర్మరణం చెందారు.

ఏడుగురు భద్రతా సిబ్బంది సహా 34 మంది గాయపడ్డారు. అఖ్తర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఉగ్రదాడి నుంచి నేను క్షేమంగా తప్పించుకున్నప్పటికీ ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగిస్తోంది. ప్రజలకు సంక్షేమ పథకాలు, సుపరిపాలనను అందించడానికి మేము చేస్తున్న కృషిని అడ్డుకోవడానికే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ వారు కశ్మీర్‌కు, ఇస్లాంకు స్నేహితులు కాదు’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు