కోర్టులు లక్ష్మణరేఖను దాటవు: సుప్రీం

10 Aug, 2018 02:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘న్యాయస్థానాలకు లక్ష్మణ రేఖ ఉంది. దానిని అధిగమించజాలవు. చట్టాలపై తీర్పులు ఇవ్వడం వరకే వాటి బాధ్యత. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌దే’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ తరఫు లాయరు దినేశ్‌ ద్వివేది వాదిస్తూ.. ‘నేరారోపణలు ఉన్నవారు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా పార్లమెంట్‌ చట్టం చేయడం అసాధ్యం. అందుకే సుప్రీం జోక్యం చేసుకోవాలి’ అని కోరారు. ‘చట్ట సభల సభ్యులపై ఉన్న కేసుల విచారణను సత్వరం చేపట్టేలా చర్యలు తీసుకోగలం. అంతేకానీ, చట్టసభల పరిధిలోని కొన్ని అంశాలపై చట్టాలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, పార్లమెంట్‌ను కోరలేమని కోర్టు పేర్కొంది.  ఒక వ్యక్తిపై ఆరోపణలు రుజువయ్యే దాకా అతడు నిర్దోషేనని, అలాంటప్పుడు అతడిని పోటీ చేయకుండా అడ్డుకోలేమన్నారు.

>
మరిన్ని వార్తలు