తప్పు దిద్దుకున్న కేజ్రీవాల్

7 Oct, 2016 12:09 IST|Sakshi
తప్పు దిద్దుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను బహిర్గతం చేయాలని  చేసిన వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతోతన తప్పును దిద్దుకునే ప్రయత్నాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేశారు. ఈ విషయంలో రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు. మనమందరం భారత ఆర్మీ వెనకాలనిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని  'రక్త వ్యాపారి' అని సంభోదించడాన్నికేజ్రీ తీవ్రంగా తప్పుబట్టారు. 
 
 సర్జికల్ స్ట్రైక్ చేశామని ప్రకటించగానే నరేంద్రమోదీకి, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ అంతర్జాతీయ మీడియాలో  అసలు అలాంటిది జరగలేదని బొంకుతున్న పాకిస్థాన్కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే తాను సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశానని తెలిపారు. పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పి   తీరాల్సిందేనని అన్నారు.  అందుకు ఈ దేశం ప్రధాని వెనకాల ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.కాగా సైనికులు వీరోచితంగా పోరాడితే దానిని నరేంద్రమోదీ రక్త వ్యాపారిలా వాడుకుంటున్నారని రాహుల్ విమర్శించిన విషయం తెలిసిందే.   
>
మరిన్ని వార్తలు