ట్రాన్స్ జెండర్స్తో ఫ్యాషన్ డిజైనింగ్

31 May, 2016 13:22 IST|Sakshi
ట్రాన్స్ జెండర్స్తో ఫ్యాషన్ డిజైనింగ్

న్యూఢిల్లీ: వస్త్రాల ఫ్యాషన్ డిజైనింగ్ ప్రెజెంట్ చేయాలంటే ఎవరైనా అందమైన ముద్దుగుమ్మలనే ఎంచుకుంటారు. సిల్క్ అయినా కాటన్ అయినా.. తాము డిజైన్ చేసిన వాటిని వారితోనే కట్టించి ప్రెజెంట్ చేస్తుంటారు. అలాంటిది ట్రాన్స్ జెండర్స్ (లింగమార్పిడి చేసుకున్నవారు)తో ఆ పనిచేయించే సాహసం ఎవరైనా చేస్తారా.. కేరళకు చెందిన షర్మిల నాయర్ ఆ ధైర్యం చేశారు. 24 ఏళ్ల యువ డిజైనర్ ట్రాన్స్ జెండర్ విషయంలో సమాజం పాటిస్తున్న వివక్ష తగ్గించేందుకుగాను తన వృత్తి సహాయాన్ని తీసుకుంది. పాశ్చాత్య దేశాల్లో ట్రాన్స్ జెండర్స్ అనేది ఒక హాట్ టాపిక్.

ఇక ఎక్కువ మొత్తంలో సంస్కృతి సంప్రదాయాలు పాటించే భారత్లో అయితే అతి సున్నితమైన విషయమే. ఇటీవల ఇండియాలో కూడా వీరి విషయంలో కాస్తంత సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. కేరళలో ట్రాన్స్ జెండర్స్కు న్యాయం చేసేలా ఒక కొత్త పాలసీని కూడా తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో ఒక యువ ఫ్యాషన్ డిజైనర్ ట్రాన్స్ జెండర్స్ను కూడా ఇతర మహిళల్లేగా గుర్తించి వారితో ఫ్యాషన్ చీరలు ప్రదర్శింపజేయడం గమనార్హం.

మీకు ఎందుకు ఇలా చేయాలన్న ఆలోచన వచ్చిందన ఆమెను ప్రశ్నించగా.. గత ఏడాది సహజమైన కాటన్, సిల్క్ చీరలను ప్రమోట్ చేసేందుకు దక్షిణాధి రాష్ట్రాల్లోని పలువురు ప్రత్యేక ప్రమోట్ గర్ల్స్ కోసం తిరిగాను. ఆ సమయంలో కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ నన్ను ఆలోచించేలా చేసింది. లింగమార్పిడి చేసుకున్న వారు కూడా మహిళలే .. వారు కూడా చీరలు దరించవచ్చు. అందుకే ఎందుకు ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ ని తన డిజైనింగ్ ప్రమోట్ చేసేందుకు ఉపయోగించుకోకూడదని ఆలోచించాను. ఆ విధంగా చేశాను' అని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు