హిమాలయం కాదు విలయాలయం

16 May, 2016 01:20 IST|Sakshi
హిమాలయం కాదు విలయాలయం

అరకు కూడా..
 
 కోల్‌కతా: హిమాలయ పరిసర ప్రాంతాలు  ప్రకృతి వైపరీత్యాలకు నెలవు అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆదివారం  ప్రకటించింది. అంతేకాకుండా భారత భూభాగంలోని 12 శాతం నేలల్లో పలు ప్రకృతి విపత్తులు సంభవించే ఆస్కారం ఉందని తెలిపింది. ఈ భూభాగంలో డార్జిలింగ్, సిక్కింలాంటి ఈశాన్య హిమాలయాల్లోని 1.8 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ లాంటి వాయవ్య హిమాలయ ప్రాంతాల్లోని 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం వైపరీత్యాలు సంభవించేదిగా ఉందని వివరించింది.

పశ్చిమ కనుమల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాలాంటి  పలు ప్రాంతాలల్లో 0.9 లక్షల.చ.కి, తూర్పు కనుమల్లోని అరకు లాంటి ప్రాంతాల్లో 0.1 లక్షల.చ.కి ఈ జాబితాలో ఉందని జీఎస్‌ఐ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు