కనువిందు చేస్తున్న ఫ్లెమింగోలు..

23 Apr, 2020 14:03 IST|Sakshi

కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం తగ్గి నదులు తేటపడుతున్నాయి. గాలి నాణ్యత పెరుగుతోంది. అల్లంతదూరాన ఠీవీగా నిలుచుని ఉన్న పర్వతాలను చూసే అవకాశం ప్రజలకు దక్కుతోంది. ఇక ఇన్నాళ్లు అడవులకే పరిమితమైన జంతువులు, పక్షులు బయటకు వస్తున్నాయి. ప్రకృతి ఒడిలో స్వేచ్చగా విహరిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. తాజాగా ముంబైలో పింక్‌ ఫ్లెమింగోలు ఒక్కచోట చేరిన ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. (నింగి నాట్యమాడుతోంది. నేల విహంగమౌతోంది)

గురువారం ఉదయం నవీ ముంబైలోని ఓ సరస్సు వద్ద వందలాది ఫ్లెమింగోలు ఒక్కచోట చేరి కనువిందు చేశాయి. సరస్సును గులాబీమయం చేశాయి. కాగా బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ వివరాల ప్రకారం గతేడాది కంటే ఈ ఏడాది 25 శాతం ఎక్కువ సంఖ్యలో ఫ్లెమింగోలు ఇక్కడికి వలస వచ్చాయి. ఏప్రిల్‌ మొదటి వారంలోనే దాదాపు లక్షన్నర పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి. వీటిలో కొన్ని రాజస్తాన్‌లోని సాంబార్‌ సరస్సు నుంచి.. ఇంకొన్ని గుజరాత్‌ రాణా ఆఫ్‌ కచ్‌.. మరికొన్ని పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుంచి వలస వచ్చాయి.

మరిన్ని వార్తలు