ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

18 Jul, 2019 18:00 IST|Sakshi

సాక్షి, చెన్నై : కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. తొక్కిసలాటలో ఆంధ్రప్రదేశ్‌‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నారాయణమ్మ ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌ గ్రేషియాను ప్రకటించింది.

నలబై ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అత్తివరదర్‌ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ గుడి పైపు దూసుకొచ్చారు. దీంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

(చదవండి : 40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు)

కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కొలువైన అత్తివరదర్ స్వామి 40 ఏళ్లకోసారి దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అత్తివరదర్‌ స్వామి దర్శన కార్యక్రమాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పూజాది లాంఛనాలతో ప్రారంభించగా... గత 18 రోజులుగా స్వామి దర్శనం కోసం భక్తులు వస్తూనే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది.

మరిన్ని వార్తలు