వైరల్‌ : ఇది నిజంగా ఊహించని దాడి

2 May, 2020 09:07 IST|Sakshi

పిలిభిత్ : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పిలిభిత్‌ జిల్లాలో ఒక పులి ముగ్గురు రైతులపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. జిల్లాకు చెందిన రామ్ బహదూర్, ఉజగర్ సింగ్, లాల్తా ప్రసాద్‌లు వ్య‌వ‌సాయ‌క్షేత్రంలో ధాన్యాన్ని తీసుకువెళ్లేందుకు ట్రాక్ట‌ర్ పై వెళ్లారు. అయితే వారు వెళ్తున్న దారిలో హఠాత్తుగా చెట్ల పొదల్లో నుంచి ఒక పులి ట్రాక్టర్‌ మీదకు దూకింది. ట్రాక్టర్‌లో ఉన్న ముగ్గరిపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన ముగ్గురు తమ కర్రలతో పులిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పులి కర్రను నోటితో బలంగా లాగడంతో రామ్‌ బహుదూర్‌ ట్రాక్టర్‌ నుంచి కిందపడిపోయాడు.
(ఆ డెలివ‌రీ బాయ్‌కు జీవితాంతం గుర్తుండిపోతుంది)

దీంతో పులిపై అదే పనిగా కర్రలతో దాడి చేయడంతో ట్రాక్టర్‌ మీద నుంచి కిందకు దూకిన పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే చిరుతపులి దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదంతా దూరం నుంచి గమనించిన కొందరు తమ ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రైతుల ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిర ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీని తెలుసుకునే ప‌నిలో ప‌డ్డార‌ని ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ వైభ‌వ్ శ్రీవాత్స‌వ తెలిపారు. 
(నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు