పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు

6 Apr, 2015 14:56 IST|Sakshi

తెలంగాణలో సిమి ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన ఉదంతం వేడి చల్లారకముందే జమ్ముకశ్మీర్లో సోమవారం జరిగిన వేరువేరు ఘటనల్లో నలుగురు పోలీసులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. కాల్పుల్లో ఓ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన ఎస్సై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఒక కేసు దర్యాప్తు నిమిత్తం షోపియాన్ జిల్లాలోని అంషీపురా గ్రామానికి వెళ్లిన ముగ్గురు పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆ సమయంలో పోలీసుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలిసింది. ఈ ఘటన జరగడానికి కొద్ది గంటల ముందు బారాముల్లా జిల్లా పట్టన్ వద్ద బస్సులో ప్రయాణిస్తోన్న సబ్ ఇన్స్పెకర్ట్ గులామ్ ముస్తఫాపై సాయుధ ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. గాయపడ్డ ఎస్ఐని బస్సు డ్రైవర్ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా, అక్కడి నుంచి అతణ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముస్తఫా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు అధికారుల తెలిపారు.

మరిన్ని వార్తలు