ఏకంగా 56 పాము పిల్లలు...

12 Jun, 2017 17:26 IST|Sakshi



కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా అలీపూర్‌ లో పాము పిల్లలే పిల్లలు. జూలోని మూడు కొండ చిలువలు ఏకంగా 56 పాము పిల్లలకు జన్మనిచ్చాయి. రాక్‌, బర్మన్‌, రిటీకోలెడ్‌ జాతులకు చెందిన కొండ చిలువలు డజన్ల కొద్ది గుడ్లను పెట్టాయి. దీంతో అలీపూర్ జంతు ప్రదర్శనశాల నిర్వహకులు ఆ  గుడ్లను భద్రంగా పొదిగించి పాముల్ని ఉత్పత్తి చేశారు.

ఇప్పటివరకూ తమ జూలో ఇంత పెద్ద సంఖ్యలో కొండచిలువలను పొదిగించడం ఇదే మొదటిసారి అని జూ నిర్వహకులు తెలిపారు.  ఈ పాములు తేమ ప్రదేశాలలో, చెట్ల తొర్రలలో నివసిస్తాయని, వీటిని తల్లి నుంచి వేరుచేసి ప్రత్యేకంగా పెంచనున్నామని, వాటికి ఆహారంగా ఎలుకలను వేస్తామని తెలిపారు.





 

మరిన్ని వార్తలు