రేప్‌ బెదిరింపులతోనే భయ్యూ ఆత్మహత్య

20 Jan, 2019 05:38 IST|Sakshi

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్‌(50) ఆత్మహత్య వెనుక మిస్టరీ వీడింది. తనను పెళ్లి చేసుకోకుంటే రేప్‌ కేసు పెడతానని సేవకురాలు పలక్‌ పురాణిక్‌(25) బెదిరించడంతోనే 2018, జూన్‌ 12న భయ్యూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఇండోర్‌ డీఐజీ మిశ్రా తెలిపారు. తగు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆశ్రమానికి చెందిన వినాయక్‌(42), శరద్‌(34)లు పలక్‌తో చేతులు కలిపి భయ్యూ మహారాజ్‌కు హైడోస్‌ మందులు ఇచ్చారని వెల్లడించారు. వీరంతా కలిసి ఆయన్ను ఆత్మహత్యకు పురిగొల్పా రని వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా, 15 రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు