భర్తకు షాకిచ్చిన ముగ్గురు భార్యలు

3 May, 2017 15:41 IST|Sakshi
భర్తకు షాకిచ్చిన ముగ్గురు భార్యలు
లక్నో: ట్రిపుల్ తలాక్ పై ముమ్మరంగా చర్చ సాగుతుండగా అలాంటిదే మరో ఉదంతం వెలుగుచూసింది. అయితే నాలుగో సారి పెళ్లి చేసుకోవాలని ఆశపడిన భర్తకు ముగ్గురు భార్యలు కలిసి షాక్‌ ఇచ్చారు. తమను మోసగించి నాలుగో నిఖాకు సిద్ధమైన భర్తపై ఆ ముగ్గురూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహ్రయిచ్‌ ప్రాంతానికి చెందిన దనీష్‌‌(30) 2013 లో మొదటి వివాహం చేసుకున్నాడు. ఆమెతో విభేదాలు తలెత్తడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె అశ్లీల చిత్రాలు తన వద్ద ఉన్నాయంటూ పుట్టింటి వారిని వేధించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అనంతరం ఆమెకు తలాక్‌ చెప్పేసి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహ బంధం కూడా ఏడాదే నడిచింది. ఇదే సమయంలో రెండో భార్య బంధువుల అమ్మాయి(15) పై లైంగికదాడికి పాల‍్పడ్డాడు.
 
ఆమె అశ్లీల చిత్రాలు కూడా తనవద్ద ఉన్నాయని, పెళ్లికి అడ్డుపడితే వాటిని బయటపెడతానని ఆమె కుటుంబసభ్యులను బెదిరించి ఆ ఆమ్మాయిని మూడో భార్యగా చేసుకున్నాడు. ఇది చాలక.. ఇటీవల మరో నిఖాకు దనీష్ సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న ముగ్గురు భార్యలు రెండు రోజుల క్రితం అడిషనల్‌ సూపరింటెండెంట్‌ దినేష్‌ త్రిపాఠిని కలిసి తాము పడ్డ అవస్థలను ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన పోలీసులు దినేష్‌ పై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు