గోవా: లాక్‌డౌన్ ప‌నిచేసింది

17 Jul, 2020 20:43 IST|Sakshi

 ప‌నాజి :  క‌రోనా క‌ట్ట‌డికి  మూడు రోజుల పాటు క‌ఠిన‌మైన లాక్‌డౌన్ విధించాల‌ని గోవా ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తొలిరోజు ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. వివిధ న‌గ‌రాల్లోనూ ప్ర‌జలు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించార‌ని నార్త్ గోవా ఎస్పీ ఉతృష్ట్ ప్ర‌సూన్ తెలిపారు. తొలిరోజు సంద‌ర్భంగా ప్ర‌ధ‌నా కూడ‌ల‌న్నీ జ‌న‌సంచారం లేక ఖాళీగా ఉన్నట్లు తెల‌పారు. మిగతా రెండు రోజుల్లోనూ లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌లెవ‌రూ అన‌వ‌స‌రంగా బ‌య‌ట తిర‌గ‌వ‌ద్ద‌ని కోరారు. అంద‌రి స‌హ‌కారంతో అతి త్వ‌ర‌లోనే క‌రోనాను అంత‌మొందించ‌గ‌ల‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  

గోవా తీర‌ప్రాంతంలోనూ క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప‌ర్యాట‌కులను అనుమ‌తించిన నేప‌థ్యంలో కేసులు పెరుగుతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా  ఈనెల 17 నుంచి 20 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుందని ప్ర‌క‌టించింది. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా మిగ‌తా ఏ సేవ‌ల‌కు అనుమ‌తి లేద‌ని పేర్కొంది. అంతేకాకుండా ఆగ‌స్టు10 వ‌ర‌కు ప్ర‌తిరోజూ రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ప్యూ  కొన‌సాగ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాల‌ని కోరారు. (ఒడిశాలో మ‌ళ్లీ లాక్‌డౌన్ )

మరిన్ని వార్తలు