మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి  

9 Mar, 2018 11:24 IST|Sakshi

మరో 10 మందికి గాయాలు

సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని పాల్గర్‌లో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. బోయిసార్‌ - తారాపూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లోని నోవాపెనే స్ఫెషాలిటీస్‌ లిమిటెడ్‌లో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడి ఇతర యూనిట్లకి మంటలు వ్యాపించాయి. పేలుడు ప్రభావంతో 12 కిలోమీటర్ల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

మండే స్వభావం ఉన్న ఎల్‌ఈడీని ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భారీ ఎత్తున ప్రమాదం సంభవించటంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం హై అలర్ట్‌ ప్రకటించామని తెలిపారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, భవనాలు కంపించడంతో ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళానికి గురైనట్టు స్థానికులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు