అడవి కుక్క వింత శబ్దం.. భయపడిన పులి

14 May, 2020 19:32 IST|Sakshi

న్యూఢిల్లీ :  తనను వెంటాడుతూ వచ్చిన పులిని వింత శబ్దం చేస్తూ బెదిరించి తప్పించుకుంది ఓ అడవి కుక్క(వైల్డ్‌ డాగ్‌). ఈ అద్భుత దృశ్యం కర్ణాటకలోని కబిని ప్రాంతంలో చోటు చేసుకుంది. పులి నుంచి తప్పించుకునేందుకు ఆ వైల్డ్‌డాగ్‌ చేసిన శబ్ధానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదో వింత శబ్దం అని, ఇలాంటి అరుపులను ఇంతవరకు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మొదటగా ఫైవ్‌జీరో సఫారీస్‌ షేర్‌ చేశారు. తర్వాత ఆ వీడియోని వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ ట్వీట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : ఈ పాము పాకదు.. నడుస్తోంది!)

వీడియో  ప్రకారం.. ఒక పులి అడవి కుక్కను వెంటాడుతూ పరుగెత్తింది. పులిని చూసిన అడవి కుక్క వేగంగా పరుగులు తీసింది. కొంత దూరం పరుగెత్తకగా అడవి కుక్క ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. పెద్దశబ్ధం చేస్తూ పులిని బెదిరించింది. కుక్క చేసిన వింత శబ్దానికి పులి కూడా భయపడి అక్కడే ఆగిపోయింది. కాసేపటికి మళ్లీ వెంటాడుతూ పరుగెత్తింది.ఆ అడవి కుక్క శబ్ధం విని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సౌండ్‌ను ఇంతవరకు ఎక్కడ వినలేదని, సహజంగా అడవి కుక్కలు ఈ రకంగా శబ్దం చేయవని, విచిత్రమైన శబ్దం. అమేజింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు