దర్జాగా పరుపుపై నిద్రపోయిన పులి...

18 Jul, 2019 15:49 IST|Sakshi

గువాహటి : అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద బీభత్సానికి మనుషులే కాదు పశుపక్ష్యాదులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కజిరంగా జాతీయ పార్కులోని ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ రోడ్డుపైకి వచ్చి పరుగులు తీసింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న మోతీలాల్‌ అనే వ్యక్తి షాపులో చొరబడి దర్జాగా పరుపుపై నిద్రపోయింది. ఈ క్రమంలో అతడు అటవీ అధికారులను ఆశ్రయించగా ప్రస్తుతం వారు పులిని తిరిగి పార్కులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ఘటన కజిరంగాలో చోటుచేసుకుంది.

తనకు ఎదురైన భయానక అనుభవం గురించి షాపు మోతీలాల్‌ మాట్లాడుతూ...‘ గురువారం పొద్దున నేను షాపులో కూర్చుని ఉన్నాను. పులి వస్తోందంటూ అరుపులు, కేకలు వినిపించాయి. బయటికొచ్చే చూసే సరికి దాదాపు 20 అడుగుల దూరంలో నా ముందు పులి నిల్చొని ఉంది. ఒక్కసారిగా భయం వేసింది. కానీ అది నన్నేమీ అనకుండా నేరుగా షాపులోకి వెళ్లి అక్కడున్న పరుపుపై నిద్రపోయింది. పాపం అది బాగా అలసిపోయినట్టుంది. మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో పులి ప్రాణం కూడా అంతే గొప్పది. అందుకే షాపు మొత్తం దానికే వదిలేశాను. అటవీ అధికారులు దానిని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఎవరికీ హాని చేయకుండా పులిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

32 ట్రాక్టర్లు.. 200 మంది

మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్‌

‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

పాన్పుపై సేదతీరిన పులి!

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

ఈనాటి ముఖ్యాంశాలు

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

‘ప్రభుత్వ అధికారినని చెప్పినా వినలేదు’

ఆ జైలు గది కూలిపోయింది!

బీజేపీ గూటికి అల్పేష్‌ ఠాకూర్‌

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

‘కుల్‌భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేయాలి’

దావూద్‌ సోదరుడి కుమారుడి అరెస్ట్‌

మాయావతికి ఎదురుదెబ్బ 

అయోధ్య కేసు: సుప్రీంకు కమిటీ నివేదిక

ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

కుమారస్వామి ఉద్వేగం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

58 పురాతన చట్టాల రద్దు

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం