ఢిల్లీపై చార్టర్‌ విమాన దాడులా!

25 Jan, 2017 17:58 IST|Sakshi
రిపబ్లిక్‌ డేకు ఢిల్లీ అంతటా గప్‌చుప్‌

న్యూఢిల్లీ: పోలీసుల, సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడే అవకాశం ఉందని జాతీయ ఇంటెలిజెన్స్‌ విభాగం చెప్పింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే, కొన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థలు 9/11 తరహా దాడులను చేసే అవకాశం ఉందని, అందుకోసం వారు చార్టెడ్‌ విమానాలు, డ్రోన్‌లను ఉపయోగించి బాంబులతో దాడి చేసే ప్రమాదం ఉందన్నారు.

గురువారం దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, విదేశాల నుంచి వచ్చే అతిథులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్లిగల్లీలో ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీటీవీలను అమర్చారు. ఇప్పటికే పెద్ద పెద్ద భవనాల్లో యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్స్‌ కూడా సిద్ధం చేశారు. ఢిల్లీ అంతటా కూడా దాదాపు 50 వేల బలగాలను మోహరించారు. డ్రోన్‌ల దాడిని, విమానాల దాడిని ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం కూడా సిద్ధం చేసి ఉంచారు.

మరిన్ని వార్తలు