వెంబడించిన పులి... వీడియో వైరల్‌

14 Nov, 2018 03:03 IST|Sakshi

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని టైగర్‌ రిజర్వ్‌ జోన్‌లో పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చంద్రాపూర్‌ జిల్లాలోని తడోబా–అంధేరి టైగర్‌ రిజర్వ్‌లో ఆదివారం పులి వాహనాన్ని వెంబడించిన సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలిసింది. పులి వెంబడించడంతో పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. ఘటన తర్వాత సమావేశమైన అధికారులు... వాహనాన్ని మూడున్నరేళ్ల ‘చొట్టి మధు’అనే పులి వెంబడించినట్లుగా గుర్తించారు.

మరిన్ని వార్తలు