టిండర్‌... టిండర్‌..!

3 Sep, 2017 12:28 IST|Sakshi

డేటింగ్‌ లవర్స్‌కి టిండర్‌ యాప్‌ ఒక వరం‍లా కనిపిస్తోంది. దీంతో యాప్‌ స్టార్స్‌లో వేగం‍గా డౌన్‌లోడ్‌ అవుతున్న యాప్‌గా టిండర్‌ టాప్‌ప్లేస్‌లో నిలిచింది.  యాప్‌స్టోర్స్‌కు అత్యధికంగా ఆదాయాన్ని ఈ యాప్‌ సమకూరుస్తోంది. టిండర్‌ యాప్‌ను లైక్‌ చేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోందని ఆన్‌లైన్‌మార్కెట్‌ డేటా సంస్థ ’యాప్‌ అన్నే‘   తెలిపింది. ఆరు నెలల కాలంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అయిన యాప్స్‌, వాటి ర్యాంకింగ్స్‌ను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది. 

ఈ ర్యాకింగ్స్‌లో టిండర్‌ మొదటి స్థానంలో ఉంది. టిండర్‌ తరువాత స్థానంలో నెట్‌ ఫ్లిక్స్‌, పండారా, క్లాష్‌ రాయల్‌ యాప్స్‌ ఉన్నాయి. మిగిలిన డేటింగ్‌ యాప్స్‌తో పోల్చితే.. టిండర్‌లో త్వరగా రిలేషన్‌షిప్‌ చేసేందుకు అవకాశాలు ఉండడం,  లోకల్‌గా ఉండేవారి సమాచారం​ వేగంగా ఉండండంతో యువత దీనిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సదరు సంస్థ  ప్రకటించింది.

 

మరిన్ని వార్తలు