ఘోరం : గుక్కపట్టి ఏడుస్తుంటే విసిగిపోయి...

25 Feb, 2018 13:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుతో కన్న ప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించిందో తల్లి. విసుగుపుట్టి తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయగా.. ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని వినోద్‌ నగర్‌కు చెందిన నేహా 25 రోజుల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి పాలు పట్టిస్తున్నప్పటికీ గుక్కపట్టి ఏడుస్తోంది(అనారోగ్య సమస్య ఉందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు). దీంతో అసహనానికి లోనైన నేహ దారుణానికి పాల్పడింది. శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసింది. పాప కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులంతా కంగారుపడగా.. తాను కూడా వారితోపాటు వెతికినట్లు నటించింది. 

చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సాక్ష్యులను విచారణ చేపట్టగా స్థానికుడొకరు నేహ చెత్తకుండీలో ఏదో మూట పడేయటం చూశానని చెప్పాడు. దీంతో పోలీసులకు ఆ తల్లిపై అనుమానం మొదలైంది. ఈ క్రమంలో వారు ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె నేరం ఒప్పుకుంది. 

చిన్నారి ఏడుస్తుంటే తట్టుకోలేకనే తాను ఆ పని చేసినట్లు వివరించింది. దీంతో పోలీసులు హుటాహుటినా చెత్త కుప్ప వద్దకు వెళ్లారు. కొన ఊపిరితో ఉన్న పసికందును ఆస్పత్రికి తరలించి బతికించే ప్రయత్నం చేశారు. అయితే తలకు బలమైన దెబ్బ తలగటంతో ఆ  పసికందు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో పోలీసులు నేహను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌ 

‘కోలుకోవచ్చు.. అందుకు నేనే నిదర్శనం’

తబ్లిగ్‌ జమాత్‌ : ఆడియో విడుదల

మర్కజ్‌ : ఈశాన్యానికి పాకిన విషపు వైరస్‌

ధారావిలో తొలి మరణం.. అధికారులు అలర్ట్‌

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా