ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపలేదు

16 Sep, 2018 03:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షననుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలనకు పంపినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన ఈనెల 9వ తేదీన సమావేశమైన మంత్రివర్గం.. ఏడుగురు రాజీవ్‌ హంతకుల విడుదలకు సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు కూడా పంపింది. అయితే, గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక ఊహాగానాలు చోటుచేసుకున్నాయి.  సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు ఈనెల 14న మాత్రమే తమకు అందాయని, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని  గవర్నర్‌ కార్యాలయం పేర్కొంది. 

మరిన్ని వార్తలు