'జయలలిత కేసుపై సుప్రీంకు వెళ్లండి'

12 May, 2015 16:55 IST|Sakshi

చెన్నై: అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని  తమిళ రాజకీయ పార్టీలు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. డీఎంకే సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి విన్నవించాయి.

జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కోరారు. హైకోర్టు తీర్పును (జయలలిత నిర్దోషిగా బయటపడటం) తాను ఊహించలేకపోయానని డీఎండీకే చీఫ్ విజయకాంత్ అన్నారు. కర్ణాటక అప్పీలు చేయాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎళంగోవన్ కోరారు. సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు తీర్పుల్లో చాలా వ్యత్యాసముందని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎంకే అధినేత రాందాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు