చర్చకు ప్రధాని సిద్ధం

29 Nov, 2016 00:47 IST|Sakshi
చర్చకు ప్రధాని సిద్ధం

నోట్ల రద్దుపై చర్చ ప్రారంభిస్తే మోదీ మాట్లాడతారన్న రాజ్‌నాథ్
- ఓటింగ్ నిబంధనకు ఒప్పుకోవాలని లోక్‌సభలో ప్రతిపక్షాల పట్టు
- మోదీ సభకు రావాలంటూ రాజ్యసభలో ప్రతిపక్షాల నినాదాలు
- నిరసనల మధ్యే లోక్‌సభలో ఐటీ చట్టం సవరణ బిల్లు
 
 న్యూఢిల్లీ: వరుసగా ఎనిమిదో రోజు సోమవారం కూడా నోట్ల రద్దు అంశం పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేసింది. చర్చ మొదలుపెడితే ప్రధాని మోదీ మాట్లాడతారని ప్రభుత్వం వాగ్దానం చేసినా... ఓటింగ్‌కు వీలు కల్పించే నిబంధన కిందే చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టారుు. దీంతో లోక్‌సభ రెండు సార్లు, రాజ్యసభ మూడుసార్లు వారుుదా పడింది. తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభలు మంగళవారానికి వారుుదా పడ్డారుు. లోక్‌సభ ప్రారంభమయ్యాక తమ వారుుదా తీర్మానాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే(కాంగ్రెస్), సుదీప్ బంధోపాధ్యాయ్(తృణమూల్), ములాయం సింగ్ యాదవ్(ఎస్పీ) డిమాండ్ చేశారు. చర్చ సమయంలో ప్రధాని సభలోనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షం కోరితే నోట్ల రద్దుపై ప్రధానమంత్రి తప్పకుండా మాట్లాడతారని, చర్చకు సహకరించాలని, ఏ నిబంధన కింద చర్చించాలనేది మాత్రం స్పీకర్ నిర్ణరుుస్తారని  హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్  పేర్కొన్నారు. రాజ్‌నాథ్ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ‘చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీల ఫిర్యాదులు, సలహాలు వినేందుకు సిద్ధం. ప్రధాని సభకు రావడమే ప్రతిపక్షాల డిమాండైతే,  ప్రతిపక్షం కోరితే చర్చలో ప్రధాని పాల్గొంటారు’  అని రాజ్‌నాథ్ చెప్పారు.  

 వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు
 అంతకుముందు ఖర్గే మాట్లాడుతూ... నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు చేటు చేసిందని, రైతులు, యువత, కార్మికులు, మహిళలు నిస్పృహలో ఉన్నారన్నారు. నిర్ణయం అమలులో లోపాల వల్ల 70 మంది చనిపోయారన్నారు.  సభలో గందరగోళానికి తెరపడాలంటే ప్రధాని తప్పకుండా సభకు రావాలని, తామిచ్చిన వారుుదా తీర్మానం చర్చకు చేపట్టాలని డిమాండ్ చేశారు. ములాయం మాట్లాడుతూ.. ఇంత ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు రాకపోతే... ప్రధాని ఇంకెప్పుడు వస్తారని ప్రశ్నించారు. క్యాో్ట్ర మృతికి సంతాపం.. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమయ్యాక... ఆదాయపు పన్ను శాఖ చట్టంలో సవరణల బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు నిరసన కొనసాగించడంతో సభ మంగళవారానికి వారుుదా పడింది. అంతకుముందు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సభ్యులు సంతాపం ప్రకటించారు.

 చర్చ ఎప్పుడో మొదలైంది: వెంకయ్య
 రాజ్యసభ సభ ప్రారంభం కాగానే క్యాస్ట్రో మృతికి సంతాపం తెలిపారు. అనంతరం సమాజ్ వాదీ ఎంపీ నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ... నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే దేశ వ్యాప్తంగా ఆక్రోశ్ దివస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాయావతి, డెరెక్ ఒబ్రియాన్, సీతారాం ఏచూరి, ఆనంద్ శర్మలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ , తృణమూల్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే నోట్ల రద్దుపై చర్చ మొదలైందని, తిరిగి కొనసాగించాలని మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను అరగంట వారుుదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక కూడా నిరసనలు కొనసాగారుు. చర్చను కొనసాగించాలని, చర్చ ప్రారంభమయ్యాక ప్రధాని సభకు వస్తారంటూ సభ్యుల్ని కురియన్ వారించారు. కాగా, అరుణ్ జైట్లీ తరఫున వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ పీవోఎస్ మిషన్లపై ఎక్సైజ్ పన్ను మినహారుుంపు నోటిఫికేషన్‌ను సభలో ప్రవేశపెట్టారు.  

 అన్ని ప్రయత్నాలు చేస్తున్నా: స్పీకర్
 ఒకట్రెండు రోజుల్లో లోక్‌సభలో పరిస్థితి చక్కపడుతుందని, సభ సజావుగా సాగుతుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. ఏ నిబంధన మేరకు చర్చించాలనేది నిర్ణరుుంచాలి’ అని ఆమె పేర్కొన్నారు.  
 
 ఇప్పటికే ‘నగదు రహితం’ : సిబల్  
 న్యూఢిల్లీ: ప్రజలంతా నగదు రహిత లావాదేవీలకు మళ్లాలన్న ప్రధాని మోదీ సూచనను కాంగ్రెస్ నేత కపిల్ సిబల్  వ్యంగ్యంగా విమర్శించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇప్పటికే ప్రజల వద్ద నగదు లేకుండా పోరుుందని అన్నారు. ‘దేశంలో 70 కోట్లకు పైగా ప్రజల నెలవారీ ఆదాయం రూ.10 వేలకు దిగువనే ఉంది. బ్యాంకుల్లో నగదును జమచేయలేని ప్రజలంతా ఇప్పుడేం చేయాలి. చాలా చోట్ల ఇంకా బ్యాంకులు, ఏటీఎంలు లేవు’ అని అని సోమవారమిక్కడ విలేకర్లతో అన్నారు.

మరిన్ని వార్తలు