టుడే న్యూస్‌ రౌండప్‌

13 Dec, 2017 19:06 IST|Sakshi

సాక్షి, రాప్తాడు : మహానేత కలలు కన్న రైతు సంక్షేమ రాజ్యం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తానని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. పెట్టుబడిని తగ్గించి, సాగునీటి, మార్కెట్‌ సౌకర్యాలను పెంచడం ద్వారా రాష్ట్రంలోని రైతులు అందరినీ రారాజులుగా చేస్తామని మాట ఇచ్చారు. మరికొద్దిరోజుల్లో ఏర్పాటుకాబోయే ప్రజాప్రభుత్వం.. యుద్ధప్రాతిపాదికన అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తుందని హామీ ఇచ్చారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధిని, రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 34వరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బహిరంగ సభను ఉద్దేశించి జగన్‌ ప్రసంగించారు.

------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------

ఏపీ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

డీఎస్సీకి హాజరు కావాలంటే తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అమరావతిలో విడుదల చేశారు. 

రాజమౌళికి చంద్రబాబు ఝలక్‌

రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవన నిర్మాణానికి రాజమౌళి ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రి తిరస్కరించారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం

మనందరి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల అనుభవం, విద్యార్హతను బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

హోంగార్డులకు సీఎం కేసీఆర్‌ వరాలు

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హోంగార్డులపై వ‌రాలు కురిపించారు. హోంగార్డుల జీతాల‌ను రూ.12 వేల నుంచి రూ. 20 వేల‌కు పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

కలకలం: మళ్లొస్తోంది.. మైనింగ్‌ జోన్ ‌!

రంగారెడ్డి జిల్లా యాచారంలో మైనింగ్‌ జోన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్థానిక రైతుల్లో భయాందోళన మొదలైంది. 

టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా

సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

------------------------------------------- జాతీయం --------------------------------------------

ఆధార్‌ లింక్‌పై కేంద్రం మరో గుడ్‌న్యూస్‌ 

ఆధార్‌ అనుసంధానంపై కేంద్రం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేసుకునే డెడ్‌లైన్‌ డిసెంబర్‌ 31ను విత్‌డ్రా చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

మొట్టమొదట సీప్లేన్‌ ఎక్కింది మోదీ కాదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  మంగళవారం నాడు సముద్ర విమానం (సీప్లేన్‌)లో జేమ్స్‌బాండ్‌లా ప్రయాణించి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'సీ ఛేంజ్'ను తీసుకు రావాలని భావించారు. అక్కడే ఆయన పెద్ద పొరపాటు చేశారు.

మాటల కత్తులు దూసి.. తొలిసారి ఎదురుపడ్డారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పూర్వ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బుధవారం పరస్పరం అభివాదం చేసుకున్నారు.

రామసేతు నిజమే: అమెరికన్‌ సైన్స్‌ చానల్‌

రామాయణం నిజంగానే జరిగిందని, రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తాజాగా అమెరికన్‌ సైన్స్‌ చానల్‌ కథనం ప్రసారం చేసింది. 

------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------

గుడ్‌న్యూస్: మార్స్‌పై చిగురిస్తున్న ఆశలు!

అంగారక గ్రహం (మార్స్‌)పై జీవం మనుగడ సాగించగలదా.. అక్కడి బౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ఆసక్తికర విషయాలు త్వరలోనే మనకు తెలిసే అవకాశాలున్నాయి. 

అమెరికాతో పోరాటం: కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రతిజ్ఞ..

తమ అణ్వాయుధ సంపత్తి గణనీయంగా పెంచుకున్న నేపథ్యంలో అమెరికాతో పోరాటంలో గెలిచి తీరుతామని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రతినబూనారు. 

ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి డౌగ్‌ జోన్స్‌ విజయం సాధించారు. 

ఆ.. కలయిక ప్రపంచానికే ప్రమాదం!

 పాకిస్తాన్‌లో ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టెలా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------

రూ.1 కే విమాన టికెట్‌

దేశీయ బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ డెక్కన్‌ విమాన ప్రయాణీకులకు బంపర్‌ఆఫర్‌ ఇచ్చింది. తమ కస్టమర్లకు రూ.1 కే విమాన టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

బిట్‌కాయిన్‌పై ఐటీ ఫస్ట్‌ బిగ్‌ యాక్షన్‌

సంచలన వర్చ్యువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌  వ్యవహారంలో దేశంలో  తొలిసారి  ఐటీ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా బిట్‌కాయన్‌ ఎక్సేంజ్‌లపై ఆదాయ పన్ను శాఖ  సర్వే నిర్వహించింది. 

ఎల్‌జీ కొత్త ఫోన్‌ వచ్చేసింది

ఎల్‌జీ  కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది.  వి 30+ పేరుతో ఈ  స్మార్ట్‌ఫోన్‌ను  భారత  మార్కెట్లో  విడుదల  చేసింది. 

జియో ఐపీవోపై రిలయన్స్‌ స్పందన

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ  రిలయన్స్‌ జియో ఐపీవోకు రానుందన్న వార్తలను  రిలయన్స్‌  కొట్టిపారేసింది. 

------------------------------------------- సినిమా --------------------------------------------

అందరి కళ్లు బాహుబలి 2నే వెతికాయి

బాహుబలి -2 : ది కన్‌క్లూజన్‌ మరో రికార్డు సొంతం చేసుకుంది. 2017కు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో అత్యంత ఎక్కువసార్లు శోధించిన అంశంగా ముందు వరుసలో నిలిచింది.

నెక్ట్స్‌ వీరే..

గతంలో సన్నిహితంగా మెలిగిన సల్మాన్‌, కత్రినాలు ఒక్కటి కావాలని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెట్టారు.

మంజుల నిర్మాతగా నాని సినిమా

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఓ సినిమాను నిర్మించనుంది.

నితిన్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న నితిన్‌ సినిమా కోసం ఇంట్రస్టింగ్ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. టైటిల్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించేలా ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 

------------------------------------------- క్రీడలు --------------------------------------------

పెళ్లిరోజున రో‘హిట్‌’.. రితిక హైలెట్‌!

పెళ్లిరోజున ఎవరైనా ఏం చేస్తారు. ఆఫీసుకు సెలవుపెట్టి రోజంతా కుటుంబంతో సరదా గడుపుతారు. కానీ రోహిత్‌ శర్మ బరిలోకి సరికొత్త రికార్డు లిఖించాడు. 

లక్మల్‌పై కసితీర్చుకున్న రోహిత్‌.!

భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంక బౌలర్‌ లక్మల్‌పై కసి తీర్చుకున్నాడు.

19 ఏళ్ల తర్వాత టీమిండియా..

భారత్‌-శ్రీలంక మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ చేలరేగిపోయారు. 

తరుణ్‌–సౌరభ్‌ జంటకు టైటిల్‌ 

 దక్షిణాఫ్రికా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ కోనా తరుణ్‌కు టైటిల్‌ దక్కింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా