టుడే న్యూస్‌ రౌండప్‌

17 Jan, 2018 19:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేటలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ... పెదగొట్టిపాడు, జానపాడులో జరిగిన ఘటనలకు బాధ్యులు టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పాపానాయుడు పేటలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మరిన్ని కథనాలు మీకోసం..

అప్పుడే బీసీల తలరాతలు మారుతాయి: వైఎస్‌ జగన్‌
‘మహానేత వైఎస్సార్‌ బతికున్నప్పుడు బీసీలందరికీ ఒక భరోసా ఉండేది. ఇంటికి ఒక్కరైనా డాక్టరో, ఇంజనీరో అయితే కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆయన నమ్మారు. అందుకే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రూపొందించి పేదలకు ఉన్నతవిద్యను దగ్గరచేశారని’ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీలకు మాటిచ్చారు.


‘ఆ రెండు ఘటనలకు టీడీపీదే బాధ్యత’
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేటలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు...


ముస్లింలకో న్యాయం, హిందువులకో న్యాయమా?
‘ముస్లింలను మెప్పించడం కోసం కాకుండా మైనారిటీలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడం కోసం కృషి చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం...


మౌనమంటే ఇదేనా.. కత్తికి కోన ఘాటు కౌంటర్‌!
ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు- సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి మధ్య ఘర్షణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


ఐ ఫోన్‌, ఐ ప్యాడ్‌ తర్వాత ప్రపంచం దృష్టి దీనిపైనే...
 ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యుర్షిప్‌ అండ్‌ టెక్నాలజీ.. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఐ క్రియేట్‌’ ! దేశప్రజల అవసరాలకు తగ్గట్లు


పద్మావత్‌’పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుంది?
వివాదాస్పదమైన ‘పద్మావత్‌’ బాలీవుడ్‌ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని అనుకుంటున్న సమయంలో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో సినిమా విడుదలను నిషేధించారు.


స్పై ప్లేన్‌ : కనురెప్ప మూసి తెరచేలోగా..!
ప్రపంచం ఇంతవరకూ ఎరుగని వేగంతో ప్రయాణించే విమానాన్ని అమెరికా రూపొందిస్తోంది.


సందర్శకులకు స్వర్గధామం ఈ నగరాలు
మానసిక ఉల్లాసం, ప్రశాంతత కోసం సెలవు రోజుల్లో షికారు వెళ్లడం ఆధునిక జీవనశైలిలో ఒక భాగంగా మారింది.


సిరీస్‌ ఓటమిపై స్పందించిన కెప్టెన్‌ కోహ్లీ
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వచ్చిన ఫలితమే సెంచూరియన్‌ టెస్టులోనూ పునరావృతమైంది.


రూ.10 నాణేల చెల్లుబాటుపై ఆర్‌బీఐ క్లారిటీ
కొన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న పుకార్లపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరోసారి స్పష్టతనిచ్చింది.


జై సింహా, అజ్ఞాతవాసి నిర్మాతలకు షాక్‌
తెలుగు సినిమా నిర్మాతల ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు చేసింది.

మరిన్ని వార్తలు