టుడే న్యూస్‌ రౌండప్‌

24 Aug, 2017 18:31 IST|Sakshi

సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్‌ పూర్తయి 24 గంటలు కూడా గడవక ముందే  తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఏకంగా కాల్పులకే దిగారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్‌ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. గత నెల రోజులుగా టీడీపీ నేతలకు అడ్డగా మారిన సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌ ముందు భూమా వర్గీయుడు, రౌడీ షీట్‌ వున్న అభిరుచి మధు...చక్రపాణి రెడ్డిపై అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిలయన్స్‌ జియో ఫోన్‌ ప్రీ బుకింగ్‌ సమయం వచ్చేసింది. జియో 4జీ ఫీచర్‌   ఫోన్‌  ప్రీ బుకింగ్‌ నేటి సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది.



<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>
 నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు!
నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్‌ పూర్తయి 24 గంటలు కూడా గడవక ముందే  తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 రౌడీల రక్షణకు గన్‌మెన్లా?
శిల్పా చక్రపాణిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేత కాల్పులకు తెగబడడాన్ని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు.

 'నీతులు కాదు.. సమాధానం చెప్పండి'
నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని వైఎస్సార్‌ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు.

 'పోలీసులే వ్యవస్థను చెడగొడుతున్నారు'
వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే వ్యవస్థను చెడగొడుతున్నారని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ చెప్పారు.

 ఉప్పుకు కూడా బిల్లు వేస్తున్న రెస్టారెంట్‌
హోటల్లో తినే తిండికి బిల్లు కడతారు, తాగే నీళ్లకు బిల్లు కడతారు,

<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>
'దేవుడిపై నమ్మకముంది.. కోర్టుకు వస్తా'
అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న వివాదస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ చీఫ్‌ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ ఎట్టకేలకు గళం విప్పారు.

 నడిరోడ్డుపై ఆరెస్సెస్‌ కార్యకర్త నరికివేత!
కేరళలో నడిరోడ్డుపై మరో ఆరెస్సెస్‌ కార్యకర్త హత్యకు గురయ్యాడు.

 ఆధార్‌ లింక్‌ సంగతేంటి మరీ?
ఆధార్‌ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.

 గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది.

<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>
 భారత్‌లోని చైనీయులకు భద్రతా సలహా!
భారత్‌లో నివసిస్తున్న చైనీయులకు ఆ దేశ ప్రభుత్వం తాజాగా భద్రతా సలహాను జారీచేసింది.

 అమెరికా బాటలో సౌదీ అరేబియా
భారత ప్రొఫెషనల్స్‌ ఎంట్రీపై అమెరికా వీసా ఆంక్షలు విధిస్తే..తాజాగా సౌదీ అరేబియా నూతన నితాకత్‌ మార్గదర్శకాలతో భారత్ నుంచి వలసలకు బ్రేక్‌ వేస్తున్నది.

 పాక్‌ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనా
పాకిస్తాన్‌ను చైనా మరోసారి వెనకేసుకొచ్చింది. పాక్‌ సార్వభౌమాధికారాన్ని, భద్రతా ఆందోళనలను అమెరికా గౌరవించాలని పేర్కొంది.

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>
జియో ఫోన్‌ ప్రీ బుకింగ్స్‌, మరికొద్దిసేపట్లో..ఎలా?
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిలయన్స్‌ జియో ఫోన్‌ ప్రీ బుకింగ్‌ సమయం వచ్చేసింది.

 రూ.200 నోటుపై ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌
చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్‌బీఐ శుభవార్త అందించింది.

 టెకీలకు ఆ ఐటీ కంపెనీ 1500 ఉద్యోగాలు
దేశీయ టెకీలకు చుక్కలు చూపిస్తున్న క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఐటీ సంస్థ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>
 రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి
యువ నటి రచన, నటుడు జీవన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

 పవన్.. రేణు.. ఇంట్రస్టింగ్ న్యూస్
చిన్నప్పటి నుంచీ తనకు కవితలు రాసే అలవాటు ఉందని, అయితే గత కొంతకాలం నుంచి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని నటి రేణు దేశాయ్ చెప్పారు.

 'వివేకం' మూవీ రివ్యూ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం.

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>
 ధోని 99 నాటౌట్!
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డుకు చేరువయ్యాడు.

 ప్రతీ మ్యాచ్ లో వద్దు..!
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య  గురువారం పల్లెకెలె వేదికగా రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే.

 10 ఓవర్ల క్రికెట్ లీగ్ లో సెహ్వాగ్!
ఓవర్ల పరంగా చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది.

మరిన్ని వార్తలు