టుడే న్యూస్ అప్‌డేట్స్

13 May, 2017 09:52 IST|Sakshi

నేటి నుంచి 4 రోజులు మోస్తరు వర్షాలు
హైదరాబాద్‌: తెలంగాణలో శనివారం నుంచి 4 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు  మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ కాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు  కాస్త తగ్గాయి. ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు, నిజామాబాద్, మెదక్, రామగుం డంలో 41, నల్లగొండలో 40.5, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 40, హన్మకొండ, ఖమ్మంలో 39, హైదరాబాద్‌ లో 38, హకీంపేటలో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

మంత్రి నారాయణను పరామర్శించనున్న చంద్రబాబు
నెల్లూరు: అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని గంటలపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా అదృశ్యమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు బృందం అక్కడి నుంచి నేరుగా విజయవాడ రావాల్సి వుంది. అయితే చంద్రబాబు రాత్రి 9.30 సమయంలో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. నేడు విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లి మంత్రి నారాయణను, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

నేడు పీజీ ఈసెట్‌ ప్రాథమిక కీ విడుదల
విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా పీజీ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీ ఈసెట్‌ ప్రాథమిక కీని శనివారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ ఆచార్య అవధాని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాథమిక కీని www.rche.ap.gov.in/ pfcet వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే  మే15వ తేదీలోగా objectionr.appfecet2017@gmail. com మెయిల్‌కు తెలపాలని సూచించారు.

నేడు హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి వీకే సింగ్
హైదరాబాద్: నేడు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 'విదేశ్ సంపర్క్‌'ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి, జనరల్ వీకే సింగ్. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, తదితర ప్రముఖులు.

భూపాలపల్లి బంద్‌కు పిలుపు
భూపాలపల్లి: మిర్చికి మద్దతు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు. మద్దతు ధర కోసం నేడు భూపాలపల్లి బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపు. కాంగ్రెస్ నేత గండ్ర దీక్షను భగ్నం చేసిన పోలీసులు, ఆస్పత్రికి తరలింపు.

తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. 23 కంపార్ట్‌మెంట్లతో భక్తులు ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, నడక భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

ఐపీఎల్-10 షెడ్యూలు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న గుజరాత్ లయన్స్. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తుది పోరుకు సిద్ధమైన ముంబై ఇండియన్స్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం

మరిన్ని వార్తలు