నేటి వార్తా విశేషాలు

16 May, 2017 08:39 IST|Sakshi

నేడు ఏపీ శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశం
అమరావతి: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మంగళవారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందుగానే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతులు పడుతున్న కష్టాలను సభలో ప్రస్తావించాలని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.  

ప్రధాని మోదీతో పాలస్తీనా అధ్యక్షుడి భేటీ
న్యూఢిల్లీ: నేడు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌. ఉన్నతస్థాయి చర్చలలో పలు అంశాలు ప్రస్తావించనున్న నేతలు

సీబీఐకి ఆధారాలు ఇవ్వనున్న ఆప్ నేత మిశ్రా
న్యూఢిల్లీ: నేడు తన నిరాహార దీక్షను ముగించనున్న ఆప్ బహిష్కృత నేత, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ అవినీతికి సంబంధించి ఆధారాలను సీబీఐకి అందజేయనున్న తిరుగుబాటు నేత మిశ్రా.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన
హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన. బండమైసమ్మనగర్‌లో 648 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అంబేడ్కర్ నగర్‌లో 40 ఇళ్ల నిర్మాణానికి నేడు భూమి పూజ చేయనున్న మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్

రాయలసీమ-బైఠాయింపు పేరుతో నిరసన
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కరువు సమస్యలపై వామపక్షాల పోరుబాట ప్రారంభం. నేడు అనంతపురం కలెక్టరేట్ వద్ద రాయలసీమ-బైఠాయింపు పేరుతో నిరసన తెలపనున్న లెఫ్ట్ నేతలు. కరువు నివారణ చర్యలు తీసుకోవాలంటూ 42 గంటలపాటు ఆందోళన చేపట్టనున్న వామపక్షాలు

నేడు, రేపు వడగాడ్పులు... మోస్తరు వర్షాలు
హైదరాబాద్‌: మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని, వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అనేక చోట్ల 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టంచేసింది. మరోవైపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు సోమవారం ఎండలు మండాయి.

ఐపీఎల్-10
నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.

>
మరిన్ని వార్తలు