నేడే కేంద్ర బడ్జెట్‌

1 Feb, 2017 06:53 IST|Sakshi
నేడే కేంద్ర బడ్జెట్‌

న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం ఉదయం సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెడ్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పలు నిర్ణయాలను ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌లో ప్రకటించనున్నారని, పన్ను శ్లాబుల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

కీలకమైన యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో..ఆయా ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలుండొచ్చు. అయితే, ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎలాంటి ప్రకటనలు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. జైట్లీ తాజా పద్దు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు