టుడే న్యూస్ అప్ డేట్స్

16 Feb, 2017 08:34 IST|Sakshi
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో గురువారం నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొంటున్నారు. స్థానిక నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ అమరణ దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
  • జార్ఖండ్: నేడు రాజధాని రాంఛీలో ప్రారంభంకానున్న మూమెంటమ్ జార్ఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు-2017. సదస్సుకు హాజరుకానున్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, తదితరులు.
  • యూపీ ఎన్నికల చివరిదైన ఏడో దశ ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల తుది గడువు. బుధవారం వరకు 365 నామినేషన్లు దాఖలయ్యాయి.
  • మహారాష్ట్ర: నేడు జిల్లా పరిషత్‌లు, పంచయతీ సమితీలకు తొలిదశ పోలింగ్ నిర్వహణ
  • యూపీ ఎన్నికలు: హర్దాయ్ లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. సీతాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొననున్న రాహుల్ గాంధీ. అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో (ఝాల్వాలో) సిద్ధార్థనాథ్ సింగ్ తరఫున ప్రచారం చేయనున్న వెంకయ్యనాయుడు
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు