లాక్‌డౌన్‌: అది ఫేక్‌ న్యూస్‌.. నమ్మొద్దు

22 Apr, 2020 18:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని షాపులు, వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయాయి. మొదట లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14 వరకు విధించిన తరువాత దానిని మే3 వ తేదీ వరకు పొడిగిస్తు‍న్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తి వేసిన తరువాత కూడా హోటళ్లు, రెస్టారెంట్లు అక్టోబర్‌ 15వ తేదీ వరకు తెరవడానికి వీలులేదు అని పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించిన లెటర్‌ కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అయితే దీనిపై పర్యాటక శాఖ స్పందించింది. ఆ వార్తలో నిజం లేదని, అది తాము ప్రకటించలేదని పేర్కొంది. ఎవరో ఫేక్‌ న్యూస్‌ సృష్టించి దానిని ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యేలా చేశారని తెలిపింది. దీని వల్ల దేశ పర్యాటక రంగం మీద ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇలాంటి అబద్దపు వార్తలు ఎవరు ప్రచారం చేశారో తెలుసుకొని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఇలాంటి వార్తలు నమ్మి ఆందోళన చెందవద్దని పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసింది. (అది నకిలీ లింక్.. క్లిక్ చేస్తే అంతే!)

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భారతదేశంలో 19,000 మంది కరోనా బారిన పడగా, 640 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల్లో 5218 పాజిటివ్‌ కేసుల్తో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, తరువాత స్థానంలో ఢిల్లీ, గుజరాత్‌ ఉన్నాయి. 
(లాక్డౌన్ పొడగింపు: ప్రచారం అవాస్తవం)

మరిన్ని వార్తలు