-

పాక్ టూర్ వీసాలు భారత్ కు ఇవ్వరట!

17 Mar, 2015 20:58 IST|Sakshi

కోల్ కతా: పాకిస్తాన్లో పర్యటించాలనుకుంటున్నారా? ఇక మీకు కష్టమే. ఎందుకంటారా, అయితే ఇది చదవండి. పాకిస్తాన్ లో పర్యటించాలనుకునే భారతీయులకు సమీప భవిష్యత్తులో ఆ ఆశ తీరేలాలేదు. ఇరుదేశాలు వీసాల ప్రక్రియకు ఇరుదేశాల నిబంధనలే కారణమని ఈ విషయాన్ని స్వయంగా భారత్ లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసితే తెలియజేశారు.  ఇరుదేశాల ప్రజలు పర్యటనలపై ఆసక్తిచూపుతున్నారని ఆయన తెలియజేశారు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుందనే విషయం మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. సిక్కులు పాకిస్తాన్ ను సందర్శిస్తుంటారు. అలాగే హిందూ పర్యాటకులు పాకిస్తాన్ లో పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందాలను తప్పనిసరిగా పాటించినట్లయితే వీసాల విషయంలో ఇబ్బందులు తొలగించుకోవచ్చని బాసిత్ తెలిపారు. దీనికి ఇరుదేశాలు ఒకరిపై ఒకరికి నమ్మకమే ప్రధాన విషయమని ఆయన పేర్కొన్నారు. వీసాల నిబంధనల్లో పారదర్శకతపై ఆయన మాట్లాడుతూ...మొదట ఇరుదేశాల మధ్య ఉన్న అగ్రిమెంట్లను అమలుచేయాలనుకుంటున్నాం. అప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. దానిద్వారా ఈ పరిణామాలను ఇతర ప్రాంతాలకూ వ్యాప్తిచేయవచ్చు అని బాసిత్ తెలిపారు.

మరిన్ని వార్తలు