-

ఢిల్లీ కాలుష్యంతో హిమచల్ కు కాసుల పంట

8 Nov, 2016 19:49 IST|Sakshi
ఢిల్లీ కాలుష్యంతో హిమచల్ కు కాసుల పంట
సిమ్లా: ఢిల్లీ కాలుష్యం హిమచల్ ప్రదేశ్ కాసులు పండిస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా. ఇది అక్షరాల నిజం. కాలుష్య కాసారంగా మారిన దేశ రాజధాని నుంచి హిమచల్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. స్వచ్ఛమైన గాలికోసం సిమ్లా, ధర్మశాలకు తరలివస్తున్నారు. హస్తినలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో టూరిస్టులు ఢిల్లీవైపు చూసేందుకు జంకుతున్నారు. ఢిల్లీవాసులు కూడా కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు శీతల ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో హిమచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సిమ్లా, ధర్మశాల టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి.

కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ఇక్కడకు వచ్చామని సిమ్లాకు పర్యటనకు వచ్చిన ఢిల్లీవాసి ఒకరు చెప్పారు. కాలుష్యంతో ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నామని ధర్మశాలకు వచ్చిన మహిళా టూరిస్ట్ ఒకరు వెల్లడించారు. గతవారం ఢిల్లీ పర్యటించిన తనకు కాలుష్యంతో కూడిన పొగమంచు కారణంగా గొంతు నొప్పి మొదలైందని విదేశీ మహిళ తెలిపారు. పర్యాటకులు పెరగడంతో అథితి గృహాలకు డిమాండ్ పెరిగిందని హిమచల్ ప్రదేశ్ టూరిజం హోటల్స్ బుకింగ్ ఇంచార్జి ధర్మశాలలో చెప్పారు. 
మరిన్ని వార్తలు