ట్రాఫిక్ జామ్ సమస్యతో స్కూల్ కు సెలవులు!

3 Jul, 2014 18:40 IST|Sakshi
ట్రాఫిక్ జామ్ సమస్యతో స్కూల్ కు సెలవులు!
పాట్నా: ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ స్కూల్ కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా  విద్యార్ధులు సకాలంలో చేరలేకపోతుండటంతో చేసేదేమిలేక స్కూల్ ను గురువారం నుంచి మూడు రోజులపాటు మూసివేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో పాట్నాకు సమీపంలోని జెతులీలో చోటు చేసుకుంది. 
 
జెతూలీ నగర శివారులోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ వద్ద ఎప్పటిలానే ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఉదయం 7.15 నిమిషాలకు చేరాల్సిన విద్యార్ధులు ట్రాఫిక్ జామ్ లో బస్సులు  ఇరుక్కుపోవడంతో 11.30 గంటల వరకు కూడా చేరలేకపోతున్నారని అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం రోజున స్కూల్ కు సకాలంలో చేరలేకపోయిన విద్యార్ధులను 12.10 గంటలకు వెనక్కి పంపగా వాళ్లు ఇంటికి చేరే సరికి సాయంత్రం 5 గంటలైందని,  ట్రాఫిక్ జామ్ నరకాన్ని చూపిస్తొందని, బస్సులో పిల్లలు కూర్చోలేక ఏడుపు అందుకున్నారని బస్సు డ్రైవర్ తెలిపారు. 
 
హైవేకి ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో ట్రాఫిక్ జామ్ లు రెగ్యులర్ వ్యవహారమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ జామ్ స్కూల్ విద్యార్ధులు చిక్కుకోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. ఈ ట్రాఫిక్ జామ్ లో కేవలం పిల్లలే కాదు.. అంబులెన్స్ లు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 
మరిన్ని వార్తలు