హెల్మెట్‌ పెట్టుకోలేదు; 4 గంటలు కరెంట్‌ బంద్‌!

1 Aug, 2019 10:01 IST|Sakshi

లక్నో : తనకు చలానా విధించిన ట్రాఫిక్‌ పోలీసులపై ప్రతీకార చర్యగా సదరు ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషనుకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశాడు ఓ అధికారి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు... శ్రీనివాస్‌ అనే వ్యక్తి దక్షిణాంచల్‌ విద్యుత్‌ విట్రన్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన వ్యక్తిగత పనికోసం బైక్‌ మీద బయల్దేరారు. అయితే శ్రీనివాస్‌ హెల్మెట్‌ ధరించని కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు ఆయన బండిని ఆపారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రూ. 500 చలానా విధించారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ బకాయిలు చెల్లించని పోలీసులు ఇలా జరిమానా విధించడం సరికాదంటూ శ్రీనివాస్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సూచించారు. ఫిరోజాబాద్‌ పరిధిలోని పోలీసు స్టేషను.. విద్యుత్‌ సంస్థకు రూ. 6 లక్షలు బకాయి పడిందని.. అలాంటిది తానెందుకు రూ. 500 జరిమానా చెల్లించాలని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆయన నుంచి పోలీసులు చలానా వసూలు చేశారు.

ఈ నేపథ్యంలో తన కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్‌ పై అధికారులను సంప్రదించకుండానే పోలీసు స్టేషనుకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు కరెంట్‌ పోవడంతో పోలీసులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో విద్యుత్‌ కార్యాలయానికి ఫోన్‌ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీఐ జాతకం ‘ఇలా ఎలా’ మారింది?

అమల్లోకి వచ్చిన ‘వరద పన్ను’

‘అంతా బాగుంటే.. 38 వేల మంది ఎందుకు’

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర పంజా

అయోధ్య కేసు : బెడిసికొట్టిన మధ్యవర్తిత్వం

యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

లెస్బియన్స్‌ డ్యాన్స్‌.. హోటల్‌ సిబ్బంది దారుణం..!

ధోని కొత్త ఇన్నింగ్స్‌ షురూ!

సిద్ధార్థ మరణంపై దర్యాప్తు వేగిరం, పోలీస్‌ కమిషనర్‌ బదిలీ 

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

‘మీ అవసరం లేదు.. పాక్‌తోనే తేల్చుకుంటాం’

రవీష్‌ కుమార్‌కు రామన్‌ మెగసెసే

టబ్‌లో చిన్నారి; సెల్యూట్‌ సార్‌!

మేఘాలను మథిస్తారా?

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఖర్గే!

ఇక ఢిల్లీలో ‘ఉన్నావ్‌’ విచారణ

జాధవ్‌ను కలుసుకోవచ్చు!

23 నిమిషాల్లో ముంబై టు పుణె

పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే

‘మెడికల్‌’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

డూడుల్‌ గీయండి... లక్షలు పట్టండి

మేం భారతీయులమే.. మా కాలనీ పేరుమార్చండి! 

మిస్టర్‌ పీఎం.. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది

నాగపుష్పం కాదు.. అంతా ఉత్తిదే!

అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!

ఈనాటి ముఖ్యాంశాలు

ఆహారానికి మతం లేదన్నారు.. మరి ఇదేంటి..!

శ్రీనగర్‌ను ముంచెత్తిన వర్షం!

మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అరెస్టు

కిడ్నీ జబ్బును గుర్తించే ‘యాప్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం