-

త్వరలో ఉచితంగా ఇంటర్నెట్!

20 May, 2016 13:01 IST|Sakshi
త్వరలో ఉచితంగా ఇంటర్నెట్!

న్యూఢిల్లీ: త్వరలో దేశమంతటా ఇంటర్నెట్ ఉచితంగా అందనుందా? తాజాగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)  విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపింది. గతంలో కొన్ని వెబ్ సైట్లను మాత్రమే ఉచితంగా అందించే విధంగా(ఫ్రీ బేసిక్స్) పద్ధతికి నో చెప్పిన ట్రాయ్ తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఇంటర్నెట్ ను ఉచితంగా ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

దీంతో ట్రాయ్ ను సంప్రదించిన కొన్ని కంపెనీలు వెబ్ సైట్ల నిర్వహణ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన ట్రాయ్ 'అండర్ కనెక్టెడ్' 'అన్ కనెక్ట్ డ్' ల కింద విభజించింది. వారికి ఏ రకమైన మోడల్ ను తీసుకోవాలో సూచనలను జూన్ 16లోగా ఈ-మెయిల్ చేయాలని తెలిపింది. ట్రాయ్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇంటర్నెట్ నిపుణుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు