రైలు లేటైతే ప్రమోషన్‌పై వేటే

4 Jun, 2018 03:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇకపై రైళ్లు ఆలస్యమైతే అధికారులను బాధ్యులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు పదోన్నతులు నిలిపేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ హెచ్చరించారు. నిర్వహణ పనుల వల్ల రైళ్లు ఆలస్యమవుతున్నాయనే కారణానికి చరమగీతం పాడాలని, రైళ్లు ఆలస్యమవకుండా దృష్టి పెట్టి నెలలోపు మార్పు చూపాలని ఆదేశించారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు, జోనల్‌ జనరల్‌ మేనేజర్లతో ఇటీవల జరిగిన సమావేశంలో రైళ్ల ఆలస్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు