రైలు ఆర్‌ఏసీ బెర్తుల పెంపు

20 Dec, 2016 04:08 IST|Sakshi

న్యూఢిల్లీ: మరింత  మంది ప్రయాణికులకు స్లీపర్‌ తరగతిలో చోటు కల్పించేలా రైల్వే శాఖ ఆర్‌ఏసీ  బెర్తుల సంఖ్యను పెంచింది. ఈ నిర్ణయం జనవరి 16 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం స్లీపర్‌ బోగీల్లో ఉన్న 5 ఆర్‌ఏసీ బెర్తులను 7కు పెంచారు. దీని వల్ల 10 మందికి బదులు 14 మందికి స్థానం దొరుకుతుంది. 3 ఏసీ కోచ్‌లలో ప్రస్తుతం ఉన్న 2 ఆర్‌ఏసీ బెర్తులను 8 మందికి చోటు కల్పించేలా 4కు పెంచారు. 2 ఏసీ కోచ్‌లలో ఈ బెర్తులను 2 నుంచి 3కు పెంచారు. దీంతో ఆరుగురికి స్థానం లభిస్తుంది.

ఆర్‌ఏసీ టికెట్‌దారునికి సీటు ఖరారైనా రాత్రి పడుకునేందుకు అవసరమైన బెర్తు నిరీక్షణ జాబితాలో ఉంటుంది. రిజర్వేషన్ టికెట్‌ కొనుగోలుదారులు సమయానికి రైలెక్కకపోయినా, రద్దు చేసుకున్నా వారి బెర్తును ఆర్‌ఏసీ టికెట్‌ కొనుగోలుదారులకు కేటాయిస్తారు. ఇద్దరికి ఆర్‌ఏసీ టికెట్లుంటే బెర్తును రెండు సీట్లుగా విభజిస్తారు.

మరిన్ని వార్తలు