59మంది కోబ్రా కమాండోలు మిస్సింగ్

6 Feb, 2017 18:43 IST|Sakshi
59మంది కోబ్రా కమాండోలు మిస్సింగ్

న్యూఢిల్లీ: నక్సల్‌ వ్యతిరేక, అటవీ యుద్ధ నైపుణ్యాల యూనిట్‌కు చెందిన 59 మంది కోబ్రా కమాండోలు ఆచూకీ లేకుండా పోయారు. ట్రైనింగ్‌ ముగించుకున్న తర్వాత బీహార్‌లో తమ తొలి అసైన్‌మెంట్‌ను అందుకున్న వీరు జమ్మూ కశ్మీర్‌ నుంచి రైలు మార్గం ద్వారా బయల్దేరారు. 2011లో విధుల్లోకి చేరిన 59మంది జవానులు ఈ మధ్యకాలంలోనే శిక్షణను పూర్తి చేసుకున్నారు.

ముఘల్సరై స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో వారితో పాటు ప్రయాణిస్తున్న కమాండర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జవానులు అందరూ వెళ్లిపోయారని అధికారులు చెబుతున్నారు. బీహార్‌లో జరుగుతున్న ప్రత్యేక నక్సల్‌ వ్యతిరేక పోరాటాల్లో వీరు కూడా చేరాల్సివుందని తెలిపారు. జవానుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందినవారేనని చెప్పారు. జవానుల పనితో షాక్‌ కు గురైన సీఆర్‌పీఎఫ్‌ ఘటనపై విచారణకు ఆదేశించింది.  కమాండోలందరూ  అనధికారికంగా సెలవు తీసుకుని స్వస్ధలాలకు వెళ్లినట్లు చెప్పింది.

మరిన్ని వార్తలు