భారీవర్షాలు.. పలు రైళ్లు రద్దు

16 Jul, 2017 18:34 IST|Sakshi
భారీవర్షాలు.. పలు రైళ్లు రద్దు

రాయ్‌గడ: భారీ వర్షాలతో వరదల కారణం‍గా రాయ్‌గడ-తితిలాగర్‌ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరదల కారణంగా ఆదివారం ఉదయం తెరువలి-సింగాపూర్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌ల మధ్య ఉన్న 585 నంబరు రైలు వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు ట్రాక్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కారణంగా కొన్ని రైళ్లను క్రమబద్ధీకరించి, కొన్నిటిని రద్దు చేశారు.


క్రమబద్ధీకరించిన రైళ్లు:
18006 జగదల్‌పూర్‌-హౌరా సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌, 22847 విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌, 12756 నాందేడ్‌-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, 57271 విజయవాడ-రాయగడ ప్యాసింజర్‌, 18301 సంబల్‌పూర్‌-రాయగడ ఎక్స్‌ప్రెస్‌, 12755 సంబల్‌పూర్‌-నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌, 58527 రాయ్‌పూర్‌-విశాఖపట్నం ప్యాసింజర్‌ ఉన్నాయి.

రద్దయిన రైళ్లు:
18211 దుర్గ్‌-జగదల్‌పూర్‌ ప్యాసింజర్‌(దుర్గిలో ఆదివారం బయలుదేరింది), 18212 జగదల్‌పూర్‌-దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌(సోమవారం జగదల్‌పూర్‌లో బయలుదేరాల్సి ఉంది).

పాక్షికంగా రద్దు:
18301 సంబల్‌పూర్‌-రాయ్‌గడ ఎక్స్‌ప్రెస్‌(ఆదివారం బయలుదేరింది)ను మునిగూడ స్టేషన్‌ వరకు నడుపుతారు. అక్కడినుంచి 18302 నెంబరుతో రాయగడ-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మునిగూడ-సంబల్‌పూర్‌ మధ్య నడుపుతారు.

18301/18302 సంబల్‌పూర్‌-రాయగడ-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మునిగూడ-రాయగడ స్టేషన్ల మధ్య రాకపోకలను రద్దు చేశారు. 58527 రాయ్‌పూర్‌-విశాఖపట్నం ప్యాసింజర్‌(ఇప్పటికే బయల్దేరింది)ను తితాల్‌గర్‌ వద్ద పాక్షికంగా రద్దు చేశారు.

18005 హౌరా-జగదల్‌పూర్‌ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ (నిన్ననే హౌరానుంచి బయల్దేరింది)ను రాయగడ వరకు నడుపుతారు. అక్కడినుంచి 18006 నెంబరుతో జగదల్‌పూర్‌-హౌరా సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌గా తితాల్‌గర్‌-హౌరా మధ్య నడిపిస్తారు.

18006 నెంబరు హౌరా-సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌(జగదల్‌పూర్‌లో ఈరోజు బయల్దేరింది) రాయగడ వరకు నడుస్తుంది. అక్కడినుంచి 18005 నెంబరు హౌరా-జగదల్‌పూర్‌ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌గా రాయగడ నుంచి జగదల్‌పూర్‌ వరకు నడుపుతారు.

18005/18006 హౌరా-జగదల్‌పూర్‌ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ను తితాల్‌గర్‌-రాయగడ మధ్య రెండువైపులా ఈరోజు రద్దు చేశారు. 58301 సంబల్‌పూర్‌-కోరాపుట్‌ ప్యాసింజర్‌ను ఈరోజు లంజిగర్‌ రోడ్డు వద్ద ఆపివేస్తారు.

58302 కోరాపుట్‌-సంబల్‌పూర్‌ ప్యాసింజర్‌ (రేపు కోరాపుట్‌లో బయల్దేరాలి)ను కోరాపుట్‌ బదులు లంజిగర్‌ రోడ్డు నుంచి సంబల్‌పూర్‌ వరకు నడుపుతారు. 58301/58302 సంబల్‌పూర్‌-కోరాపుట్‌-సంబల్‌పూర్‌ ప్యాసింజర్‌ లంజిగ్‌ రోడ్డు, కోరాపుట్‌ల మధ్య రెండు వైపులా రద్దు చేశారు.

మరిన్ని వార్తలు