రాజధానిపై పొగమంచు పంజా

30 Dec, 2019 10:44 IST|Sakshi

ఢిల్లీని కప్పేసిన పొగమంచు..

విమానాలు దారి మళ్లింపు, రైళ్లు ఆలస్యం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దట్టంగా అలుముకున్న మంచుతో ప్రజలు, వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు చలిగాలులు , మరోవైపు పొగమంచుతో రాజధాని అతలాకుతలమవుతోంది. మంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. వాతావరణంలో మార్పులు కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. సప్దర్‌జంగ్‌లో 2.6, పాలంలో 2.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలను అధికారులు దారిమళ్లించారు.

ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోనూ పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు కారణంగా గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. దాన్కర్ ప్రాంతంలో మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి కెనాల్‌లో పడింది.  దీంతో కారులో 11 మంది ప్రయాణిస్తుండగా అందులో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో నలుగురు మృతిచెందారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ, తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు