వారి కోసం రైల్వే రిజర్వేషన్‌లో ప్రత్యేక కాలమ్‌

12 Dec, 2016 15:25 IST|Sakshi

న్యూఢిల్లీ: లింగమార్పిడి వ్యక్తుల్ని భారతీయ రైల్వే థర్డ్‌ జెండర్‌గా గుర్తిస్తూ వారి కోసం రైల్వే రిజర్వేషన్‌, క్యాన్సిలేషన్‌ దరఖాస్తుల్లో స్త్రీ, పురుషులతో పాటు మూడో కాలమ్‌ కేటాయించింది. టికెట్‌ కౌంటర్లతో పాటు ఆన్‌లైన్‌ విధానంలోనూ త్వరలో ఇది అమలుకానుంది.

హిజ్రాలు, లింగమార్పిడి వ్యక్తుల హక్కుల్ని కాపాడేందుకు వారిని థర్డ్‌ జెండర్‌గా గుర్తించాలంటూ 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో వారికోసం కాలమ్‌ కేటాయిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. 

మరిన్ని వార్తలు